వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆనంద్, మల్లికార్జున్ కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వీరి కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.
లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి - రోడ్డు ప్రమాదం
కారు లారీని ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ రోడ్డులో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.
![లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి road accident at kothakota in wanaparthy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9119837-thumbnail-3x2-accident.jpg)
లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఆనంద్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లికార్జున్‌కు తీవ్ర గాయాలు కావటంతో చికిత్స కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నా ఫలితం లేకపోయింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ఇదీ చదవండి:ఒకే జిల్లాలో ఒకే రోజు 5 మిస్సింగ్ కేసులు