మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాయిపల్లికి చెందిన బాబు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై తిమ్మాయిపల్లి నుంచి జవహర్‌నగర్‌కు వస్తున్నారు. ఇదే క్రమంలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో అతనికి ఎదురుగా సురేశ్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి బాబు వాహనాన్ని ఢీ కొట్టాడు.
ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి - జవహర్‌నగర్ తాజా వార్తలు
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాబు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. సురేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం.. కళ్లముందే దగ్ధమైన వరిగడ్డి