మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శ్రీనివాస కాలనీ వద్ద జడ్చర్ల ప్రధాన రహదారిపై కారు, రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
కారు, రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు - మహబూబ్నగర్ జిల్లా నేరవార్తలు
మహబూబ్నగర్ జడ్చర్ల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
road accident
జడ్చర్ల వైపు నుంచి మహబూబ్నగర్ వైపు వస్తున్న ద్విచక్రవాహనాలను ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనాలపై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తక్షణం అక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతివేగం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.