నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూరు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
గోవూరు గ్రామానికి చెందిన దండు సాయిలు, సుండు ప్రవీణ్‌లు ద్విచక్ర వాహనంపై చందూరు నుంచి గోవూరు వస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోకి రాగానే నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ వెనక నుంచి వీరి బైకును ఢీకొట్టింది. ఫలితంగా ఇద్దరు లారీ చక్రాల కింద పడి మృతి చెందారు.