హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సార్ నగర్ మధురనగర్కు చెందిన ప్రియాంక ((20) ఎంబీబీఎస్ విద్యార్థిని, రష్యా), మిత్తి మోడీ ((20) గీతం యూనివర్సిటీ, వైజాగ్,) జూబ్లీహిల్స్ పబ్ నుంచి లాంగ్ డ్రైవ్లో భాగంగా లింగంపల్లి వైపు వెళ్తుండగా.. గచ్చిబౌలి హెచ్సీయూ గేట్ నంబరు 2 సమీపంలో కారు అదుపు తప్పి.. చెట్టును ఢీకొట్టింది.
చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు - Road accident news in Hyderabad
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో వోల్వో కారు బంజారాహిల్స్ నుంచి లింగంపల్లి వైపు వెళ్తుండగా చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరప అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరికి గాయాలయ్యాయి.
![చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు Car accident at Gatchibauli police station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9486056-72-9486056-1604915685301.jpg)
చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
ప్రియాంక కారు బెల్డు పెట్టకపోవడం వల్ల అక్కడిక్కడే మృతి చెందింది. కారు డ్రైవ్ చేస్తున్న మిత్తి మోడీ ప్రాణపాయం నుంచి బయట పడ్డాడు. ప్రియాంక, మిత్తి మోడీ మద్యం సేవించారని.. మిత్తి మోడీని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతి చెందిన ప్రియాంక(20) మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి:60లీటర్ల నాటుసారా, 180 కిలోల బెల్లం పట్టివేత
Last Updated : Nov 9, 2020, 4:43 PM IST