సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురుగా వస్తున్న ఆటోను పాల ట్యాంకర్ ఢీ కొట్టింది. గర్మీ పండగకు బంధువుల ఇంటికి వచ్చి.. తిరిగి స్వస్థలం హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఘోర ప్రమాదం: ఆటో పాల ట్యాంకర్ ఢీ.. ఇద్దరు మృతి - siddipeta crime updates
ఎదురుగా వస్తున్న ఆటోను పాల ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ వద్ద జరిగింది. క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘోర ప్రమాదం: ఆటో పాల ట్యాంకర్ ఢీ.. ఇద్దరు మృతి
ఆటోలో నలుగురు చిన్నారులు, ముగ్గురు పెద్దవాళ్లు ప్రయాణిస్తుండగా.. షేక్ నాగూర్(25), యకోబీ(12) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు మరమ్మతులు వల్ల వన్‌వే లో వాహనాలను అనుమతిస్తున్నారు. అందువల్లే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.