వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాలపల్లికి చెందిన నందు(30) ధారూరు మండలం మోమిన్కలాన్లో బంధువుల అంత్యక్రియలకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బంధువులు వెంకటేశ్, ప్రభాకర్లతో కలిసి తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. దాచారం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తోన్న జీపు వీరి బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో నందు అక్కడికక్కడే మృతి చెందగా.. వెంకటేశ్, ప్రభాకర్లకు తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు - vikarabad district crime news
వికారాబాద్ జిల్లా దాచారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని జీపు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
![రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు road accident at Dyacharam in vikarabad district one dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8960793-896-8960793-1601216848400.jpg)
రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు వెంకటేశ్ మిట్టకోడూరు, ప్రభాకర్ తుంకిమెట్లుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి: చిన్నారిని చిదిమేసిన కారు ప్రమాదం
Last Updated : Sep 27, 2020, 9:19 PM IST