నిర్మల్ జిల్లా తల్వేద గ్రామానికి చెందిన తోకల సిద్దేష్ (38) అతని భార్య ముత్తవ్వ (33) ద్విచక్ర వాహనంపై నర్సాపూర్ (జి) మండలంలోని డొంగుర్ గాం గ్రామంలోని సిద్దేశ్వరుని దర్శనానికి బయలుదేరారు. దిలావర్ పూర్ గ్రామ సమీపంలోకి రాగానే వేగంగా వస్తున్న కారు వెనక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.
పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం - రోడ్డు ప్రమాదం వార్తలు నిర్మల్ జిల్లా
దీపావళి పండుగ రోజు ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్తుండగా వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని కారు వేగంగా ఢీకొట్టడం వల్ల ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
![పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9542703-thumbnail-3x2-accident.jpg)
పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
ఈ ఘటనలో ముత్తవ్వ అక్కడికక్కడే మృతి చెందగా, సిద్దేష్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇదీ చదవండి:గుర్తుతెలియని వాహనం ఢీకొని ఉద్యోగి మృతి