ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి మద్యం మత్తులో కారును నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మాదాపూర్ హైటెక్‌సిటీ చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సిగ్నల్ జంప్ చేసి కారుని నడుపుతున్న కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి, బైక్‌పై మాదాపూర్ నుంచి కొండాపూర్ వైపుకి వెళ్తున్న భార్యాభర్తలు గౌతమ్‌దేవ్(33), శ్వేతని ఢీ కొన్నాడు. ఈ ఘటనలో గౌతమ్ దేవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాల పాలైన శ్వేతని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.