పొగమంచు, అతివేగం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. హైదరాబాదులోని తాడ్‌బండ్‌కు చెందిన ఒకే కుటుంబంలోని 11 మంది కర్ణాటకలోని గుర్మిత్‌కల్‌కు తెల్లవారుజామున బయల్దేరారు. చేవెళ్ల మండలంలోని కందవాడ స్టేజి దాటిన తర్వాత రోడ్డు మలుపులో వీరు ప్రయాణిస్తున్న కారు.. ముందుగా వెళ్తున్న వాహనాలను ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్‌వెల్ లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
అతివేగం..
అతివేగంగా వెళ్లడం, పొగమంచు కూడా కావడంతో పట్టు కోల్పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. టైరు కూడా ఊడి గాలిలో ఎగిరి వాహనంలోకి దూసుకొచ్చిందంటే కారు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో ఊహించుకోవచ్చు.
మార్చురీకి తరలింపు..
మృతులు ఆసిఫ్‌ఖాన్, సానియా, నజియా బేగం, హర్ష, నజియా భాను, హర్షభానుగా గుర్తించారు. మరొకరు కూడా మరణించారు. తీవ్రంగా గాయపడినవారిన హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారుయ. స్వల్పంగా గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
ఆసిఫ్ ఖాన్ భార్య నజియా బేగంకు పక్షవాతం రావడంతో గుర్మిత్‌కల్‌కు చికిత్స నిమిత్తం వెళ్తున్నారు. ఉదయాన్నే బయలుదేరగా... ఆరున్నర, ఏడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దారిలో తినడానికి ఇంటి నుంచి తీసుకొచ్చి భోజనం, చపాతీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
ఇదీ చూడండి:పెళ్లిలో మాంసం పెట్టలేదని గొడ్డలితో హత్య