ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు కారును ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి మలుపు వద్ద జరిగింది. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
బురెడ్డిపల్లి మలుపు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - తెలంగాణ తాజా వార్తలు
జడ్చర్ల మండలంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై.. బురెడ్డిపల్లి మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు కారును ఢీ కొట్టారు. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
బురెడ్డిపల్లి మలుపు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులు మలుపువద్ద వేగంగా కారును ఢీకొట్టారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన యువకుడిని మహబూబ్నగర్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:నల్లకుంటలో రోడ్డు ప్రమాదం... సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి