హైదరాబాద్లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓల్డ్ బోయినపల్లిలోని లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ వద్ద బొలెరో వాహనం వేగంగా వచ్చి యువకుడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అవినాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో ఓ యువకునికి గాయాలు - hyderabad latest news
ఓ రోడ్డు ప్రమాదంలో ఓ యువకునికి గాయాలయ్యాయి. బొలెరో వాహనం వేగంగా వెనక నుంచి యువకుడిని ఢీ కొట్టింది. స్థానికులు ఆగ్రహించి డ్రైవర్ను చితకబాదారు.
![రోడ్డు ప్రమాదంలో ఓ యువకునికి గాయాలు road accident at bowenpally hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10216974-732-10216974-1610457380101.jpg)
రోడ్డు ప్రమాదంలో ఓ యువకునికి గాయాలయ్యాయి
యువకుడి చాతిపై నుంచి వాహనం వెళ్లగా.. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆగ్రహంచి డ్రైవర్ను చితక బాదారు. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి వచ్చిన అవినాష్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని డ్రైవర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:వర్డ్ వార్: మందేసి బస్సెక్కిన హోంగార్డు.. మధ్యలో దిగమన్న కండక్టర్