సంతోషంగా పండుగ జరుపుకుందాం అనుకున్న సమయంలో ఆ కుటుంబానికి ఓ పిడుగులాంటి వార్త వినిపించి.. కుటుంబ సభ్యుల్లో తీరని విషాదాన్ని నింపింది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భగతసింగ్నగర్ చెందిన అంజనాబాయి కుమారస్వామి దంపతుల మనవడు యశ్వంత్ (14) పండుగకు వచ్చాడు. తన మేనమామ అయిన సంజుతో కలిసి టపాసులను కొనుగోలు చేయడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వివేకానంద చౌరస్తా వద్ద ఓ ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొనగా యశ్వంత్ అక్కడిక్కడే మృతి చెందాడు.
టపాసుల కోసం వెళ్లిన తమ మనుమడు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలియగానే ఆకుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. యశ్వంత్ తల్లిదండ్రులు సరిత రాజు హైదరాబాద్లోని బోరాబండలో నివాసం ఉంటారు. కాగా రోడ్డుప్రమాదం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దీపావళి వేళ విషాదం: టపాసుల కోసం వెళ్లి ఓ బాలుడు మృతి - భైంసా వద్ద రోడ్డు ప్రమాదం తాజా వార్త
దీపావళి రోజు ఓ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. పండుగ పూట టపాకాయలు తీసుకోవడానికి వెళ్లొస్తున్న క్రమంలో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈప్రమాదంలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మరొకరికి గాయాలయ్యాయి. ఈఘటన నిర్మల్ జిల్లా భైంసాలో చోటుచేసుకుంది.
దీపావళి వేళ విషాదం: టపాసుల కోసం వెళ్లి ఓ బాలుడు మృతి