తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లైవ్ వీడియో: ప్రాణాల మీదికి తెచ్చిన తొందరపాటు - lorry collide bike at bellampally

ట్రాఫిక్​ సిగ్నల్​ పడిందంటే చాలు... వెనక నుంచి ఏమొస్తున్నాయో కూడా చూడకుండా... దూసుకెళ్తుంటారు. చిన్నచిన్న సందుల్లోంచి రయ్యుమంటూ వెళ్లిపోతుంటారు. అలాంటి ఓ ద్విచక్రవాహనదారుని తొందరపాటే... ఇద్దరి ప్రాణాలమీదికి తెచ్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చౌరస్తా వద్ద జరిగింది.

road accident at bellampalli junction
road accident at bellampalli junction

By

Published : Dec 5, 2020, 4:55 PM IST

ప్రాణాల మీదికి తెచ్చిన ద్విచక్రవాహనదారుని తొందరపాటు

ద్విచక్రవాహనదారుడి తొందరపాటు ఇద్దరి ప్రాణాల మీదికి తెచ్చింది. మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఓ లారీని బైక్‌ ఢీకొనగా... మహిళ తీవ్రంగా గాయపడింది. లారీకి ముందు నుంచి కుడివైపునకు ద్విచక్రవాహనదారుడు కదులుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

బైకును డ్రైవర్​ గమనించకపోవటం... అదే సమయంలో సిగ్నల్​ పడటం వల్ల లారీని డ్రైవర్​... ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో ద్విచక్రవాహనం కిందపడిపోగా.... మహిళ కాళ్లపై నుంచి లారీ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడిన సమయంలో తొందరగా వెళ్లాలని కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

ఇదీ చూడండి: హోటళ్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details