కామారెడ్డి జిల్లా రాఘవపల్లికి చెందిన సిద్ధిరాములు, శివ శంకర్ అన్నదమ్ములు. వీరు ద్విచక్ర వాహనంపై నాగిరెడ్డిపేటకు వెళ్తున్నారు. బంజారా తండా వద్ద వీరి ముందు వెళ్తున్న డీసీఎం వ్యానును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అన్న సిద్ధిరాములు(28) మృతి చెందగా.. తమ్ముడు శివ శంకర్(26) తీవ్ర గాయాలయ్యాయి.
అన్న మృతి.. తమ్ముడికి తీవ్ర గాయాలు... - కామారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదం
వారిద్దరు అన్నదమ్ములు. పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఊరు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వారు డీసీఎం వ్యానును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అన్న మృతి చెందగా.. తమ్ముడికి తీవ్ర గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా బంజారా తండా వద్ద జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో అన్న మృతి.. తమ్ముడికి తీవ్ర గాయాలు..
అతన్ని మెదక్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజయ్య తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిలో ఒకరు చనిపోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఆ ఊరిలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి:విషాదం: అత్తారింటికి వెళ్తూ... అనంతలోకాలకు