నిజామాబాద్ జిల్లా బాల్కొండ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యాన్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. వ్యాన్‌లో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న మూడు టన్నులకుపైగా రేషన్ బియ్యం బయటపడ్డాయి. నిర్మల్ ప్రాంతానికి చెందిన వ్యాపారులు రేషన్ బియ్యం కొనుగోలు చేసి వ్యాన్‌లో తరలిస్తుండగా బాల్కొండ వద్ద టైర్ ఫంక్చర్ కాగా వ్యాన్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.
వ్యాన్ బోల్తా.. బయటపడిన రేషన్ బియ్యం.. - వ్యాన్ బోల్తా
అదుపుతప్పి వ్యాన్ బోల్తా పడి అక్రమంగా తరలిస్తున్న రైషన్ బియ్యం బయటపడిన ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ శివారులో జరిగింది. పట్టుబడిన బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉప తహసీల్దార్ శ్రీనివాస్ స్వాధీనం చేసుకుని ఆర్మూర్‌కు తరలించారు.
వ్యాన్ బోల్తా.. బయటపడిన రేషన్ బియ్యం..
వ్యాన్‌లోని బియ్యం బస్తాలు రహదారిపై పడిపోయాయి. వ్యాన్ బోల్తాపడి ఇంజన్‌కు మంటలు వ్యాపించగా.. ఘటనా స్థలికి చేరుకున్న కానిస్టేబుళ్లు, రహదారిపై వెళ్లే వారు, హైవే సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్ పరారయ్యాడు. పట్టుబడిన బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉప తహసీల్దార్ శ్రీనివాస్ స్వాధీనం చేసుకుని ఆర్మూర్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:బిడ్డను అమ్మిన ఐదు నెలలకు వెలుగులోకి...