ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ పట్టణ శివారులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మద్దిరాల మండలం చిననెమిల గ్రామానికి చెందిన ఇరువురు మిత్రులు తమ పనులను ముగించుకొని సూర్యాపేట నుంచి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమై వస్తున్నారు. నూతనకల్ మండల కేంద్రం నుంచి ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెంకు వెలుతున్న వ్యక్తి.. రహదారి గుంతలకు ద్విచక్రవాహనం అదుపుతప్పింది.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ముగ్గురికి గాయాలు - two bikes collide in nuthanakal
సూర్యాపేట జిల్లా నూతనకల్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. దీంతో ముగ్గురు గాయాలపాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డుపై ఉన్న గుంతల వల్ల బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ముగ్గురికి గాయాలు
దీంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:కారులో ఇరుక్కుని ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి