తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రైస్​ పుల్లింగ్​కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​ - రంగారెడ్డి జిల్లా నేర వార్తలు

రైస్​ పుల్లింగ్​కు పాల్పడుతున్న 14 మందిని శంషాబాద్​ ఎస్​ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రైస్​ పుల్లింగ్​ పాత్ర, నగదుని స్వాధీనం చేసుకున్నారు.

rice pulling gang was arrested in rajendra nagar ps
రైస్​ పుల్లింగ్​కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​

By

Published : Oct 19, 2020, 10:39 AM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సిక్ చావునీ ప్రాంతంలో రైస్ పుల్లింగ్​కు పాల్పడుతున్న 14 మందిని శంషాబాద్ ఎస్​ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. 9 మంది కర్నూలు వాసులతో చేతులు కలిపి ఓ వ్యక్తితో రూ.15 లక్షలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు.

వారి నుంచి రైస్ పుల్లింగ్ పాత్ర, ఒక కారు, బైక్, రూ.1,30,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి:నేటి నుంచి భారత్- శ్రీలంక నౌకాదళ విన్యాసాలు

ABOUT THE AUTHOR

...view details