తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రైస్​ పుల్లింగ్​ ముఠా అరెస్ట్​

రైస్​ పుల్లింగ్​ పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్​ చేశారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పాములు, కారు, 8 లక్షల నగదు, 12 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Feb 9, 2019, 4:55 PM IST

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు

రైస్​ పుల్లింగ్​ ముఠా అరెస్ట్​
రాచకొండ కమిషనరేట్​ పరిధిలో రైస్​ పుల్లింగ్​ పేరిట మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్రముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులను భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.7.90 లక్షల నగదు, రూ.12 లక్షల విలువైన బంగారం, కారు, రైస్ పుల్లింగ్ పరికరాలు, పాములు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు రాష్ట్రాల్లో కేసులున్నాయని రాచకొండ సీపీ మహేష్​ భగవత్ తెలిపారు. పాములను చూపించి ప్రజలను నమ్మిస్తున్నారని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మోక్షరాజుపై పీడీయాక్ట్​ నమోదు చేస్తామని సీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details