చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లిన అధికారిపై ఆక్రమణదారులు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కూకట్పల్లి కాముని చెరువు శిఖం భూమిలో వెలిసిన పలు నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గురువారం పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.
బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేత - Attack on Revenue officials at KukatPally
అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లిన అధికారితో ఆక్రమణదారులు వాగ్వాదానికి దిగారు. దీనితో... పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు.
బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు
రాఘవేంద్ర సోసైటీలోని 908 సర్వేనెంబర్ భూమిలో ఆక్రమణలపై కూకట్పల్లి మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనితో బుధవారం అధికారులు దాడికి పాల్పడ్డారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు... బందోబస్తు మధ్య గురువారం అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
ఇదీ చదవండి:రెండో భార్య పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న మొదటి భార్య