చర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రవి నాయక్ (37) గుండెపోటుతో మృతి చెందినట్లు జైలు అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా అనువాడ మండలం బుద్దారం గ్రామానికి చెందిన రవినాయక్పై చైన్ స్నాచింగ్ కేసుల్లో రెండున్నర నెలల క్రితం పీడీ యాక్ట్ కింద కేసు నమోదైంది. అతనిపై శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావటంతో జైలులో రిమాండ్లో ఉన్నాడు.
చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ మృతి - తెలంగాణ తాజా వార్తలు
చైన్ స్నాచింగ్ కేసుల్లో రిమాండ్ ఖైదీ చర్లపల్లి కేంద్ర కారాగారంలో గుండె పోటుతో మృతి చెందినట్లు జైలు అధికారులు తెలిపారు. కానీ పోలీసులు కొట్టిన దెబ్బలకే తన భర్త మరణించినట్లు రవినాయక్ భార్య పేర్కొంది. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ మృతి
కాగా జైలు అధికారులు, పోలీసులు కొట్టిన దెబ్బలకే తన భర్త మరణించాడని మృతుడి భార్య, కుటుంబ సభ్యులు కుషాయిగూడలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చర్లపల్లి జైలు సూపరింటిండెంట్, శంషాబాద్ సీఐ వెంకట్ రెడ్డిలే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం రవినాయక్ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు జైలు అధికారులు తరలించారు.
Last Updated : Dec 30, 2020, 9:31 AM IST