బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడి ఆత్మహత్య - నల్గొండ జిల్లా కొత్తగూడెం వద్ద లారీ కిందపడ్డ యువకుడు
![బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడి ఆత్మహత్య remand prisoner Attempt to escape Larry collides and dies at nalgonda district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8472726-616-8472726-1597815024285.jpg)
09:46 August 19
బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడి ఆత్మహత్య
నల్గొండ జిల్లాలో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం వద్ద యువకుడు లారీ కిందపడ్డాడు. మృతుడు ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం ఎడ్లూరుపాడు వాసి పేరం వెంకట్రావు(23)గా గుర్తించారు.
వెంకట్రావు 12 ఏళ్ల బాలికను ఇటీవల ప్రేమ పేరుతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. పోలీసుల సాయంతో బాలిక, వెంకట్రావును తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ తరుణంలో కొత్తగూడెం వద్దకు రాగానే వాంతులు అవుతున్నాయని వెంకట్రావు వాహనం దిగాడు. అటుగా వస్తున్న లారీ కిందపడి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదీ చూడండి :జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం