జగిత్యాల జిల్లా హస్నాబాద్‌కు చెందిన వెంకటేశ్ అనే విద్యార్థి ఎంసెట్ ర్యాంకులో క్వాలిఫై కాకపోవటంతో మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృత దేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురి గదిలో భద్రపరిచారు.
కరోనా మృతదేహంతోనే మరొకరి భౌతికకాయం.. కుటుంబసభ్యుల్లో భయంభయం - కరోనాతో వ్యక్తి మృతి తాజా వార్తలు
ఒకరు కరోనా లక్షణాలతో మృతి చెందిన వ్యక్తి మృత దేహం.. ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృత దేహాలను ఒకే మార్చురి గదిలో ఉంచటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
కరోనాతో వ్యక్తి మృతి.. మరో యువకుడు ఆత్మహత్య
కొద్దిసేపటికే కరోనా లక్షణాలతో మృతి చెందిన వృద్దుడి మృత దేహాన్నీ అదే గదిలో ఉంచారు. అది గమనించిన గమనించిన కటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కరోనా వైరస్ వ్యాపిస్తే ఎలాగని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఆ రెండు ప్రాజెక్టుల నిర్వహణ మాకే ఇవ్వాలి: కేసీఆర్