ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో గత నెల 3న సుదర్శన్ అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం వల్ల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. యువకుడి మృతికి కారణాలు తెలపాలంటూ కారేపల్లిలోని పోలీస్స్టేషన్ ముట్టడికి బయలుదేరారు.
కేసు విచారణలో జాప్యం.. పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నం - రేలకాయలపల్లి గ్రామస్థుల ఆందోళన వార్తలు
ఖమ్మం జిల్లా రేలకాయలపల్లిలో గత నెల 3న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అప్పటి నుంచి కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పోలీస్స్టేషన్ ముట్టడికి యత్నించారు. యువకుడి మృతికి గల కారణాలను తెలపాలంటూ డిమాండ్ చేశారు.
![కేసు విచారణలో జాప్యం.. పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నం Relakayalapally Villagers attempted to storm the police station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8893922-284-8893922-1600768545867.jpg)
కేసు విచారణలో జాప్యం.. పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నం
విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసులు, ఎస్సై స్రవంతి మాణిక్యరం మీదుగా స్టేషన్కు వస్తోన్న గ్రామస్థులను నిలువరించి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మృతికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు హామీ ఇవ్వడం వల్ల గ్రామస్థులు శాంతించారు.
ఇదీచూడండి..నర్సాపూర్ లంచం కేసులో రెండో రోజు విచారణ