మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లక్ష్మణ్ తండా సమీపంలో అటవీ భూముల్లో కందకం పూడ్చివేసి రోడ్డు నిర్మాణం చేపట్టడంపై అధికారులు విచారణ చేపట్టారు. మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భూముల్లో నుంచి చేపట్టిన రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఆ భూముల్లోకి ఎవరూ ప్రవేశించకుండా... అధికారులు కందకం తవ్వారు. కందకంపైనే గచ్చకాయ మొక్కలు కూడా ఉన్నాయి.
అటవీ భూములను ఆనుకొని ఉన్న కొన్ని వందల ఎకరాల పట్టా భూములను హైదరాబాద్కు చెందిన స్థిరాస్తి వ్యాపారులు కొలుగోలు చేశారు. భూముల విలువ పెంచుకునేందుకు అటవీశాఖ తవ్వించిన కందకాన్ని పూడ్చి... దానికి 20 మీటర్ల దూరంలో కొత్తగా తవ్వించారని స్థానికులు ఆరోపించారు. అటవీ హద్దులను కూడా మార్చేసి కిలోమీటరు మేర రోడ్డు నిర్మాణం చేపట్టారని ఫిర్యాదు చేయగా అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.