మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చెందిన రఘు అనే స్థిరాస్తి వ్యాపారి... హైదరాబాద్‌లోనేగాక నగరశివారు ప్రాంతాల్లో స్థలాలు, అపార్ట్‌మెంట్‌లో ప్లాట్లు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేశాడని బాధితులు ఆరోపించారు. అలా నమ్మించి పలువురి వద్ద నుంచి రూ.10 నుంచి 35 లక్షల వరకు వసూలు చేశాడని, మరికొందరికి అధిక వడ్డీ ఇస్తానంటూ మాయమాటలు చెప్పి వారి నుంచి రూ. లక్షల రూపాయలు వసూలు చేశాడని తెలిపారు.
మోసాలకు పాల్పడ్డ స్థిరాస్తి వ్యాపారిపై ఫిర్యాదు - latest cheating cases in madhapur ps
ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్ నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టినవారికి అధిక వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మబలికి రూ. కోట్లు కొల్లగొట్టిన ఓ స్థిరాస్తి వ్యాపారిపై బాధితులు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
అధిక వడ్డీ ఇస్తానంటు మోసాలకు పాల్పడతున్న స్థిరాస్తి వ్యాపారిపై కేసు నమోదు
పెట్టుబడికి వడ్డీ రాక, స్థలాలు రిజిస్ట్రేషన్ అవకపోవడంతో ఆర్థింగా నష్టాల్లో కూరుకుపోయిన బాధితులు స్థిరాస్తి వ్యాపారి కంపెనీ చుట్టూ పలుమార్లు తిరిగిన ఫలితం లేదన్నారు. కొన్ని నెలలుగా ఆ వ్యాపారి కనిపించగుండా తీరుగుతున్నాడని పేర్కొన్నారు. తీవ్రంగా నష్టపోయిన మేము ఏం చేయలేని పరిస్థితిలో పోలీసులను ఆశ్రయించామని బాధితులు వాపోయారు.
ఇదీ చూడండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ