తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రేషన్​ బియ్యాన్ని నూకలుగా మార్చి సరిహద్దులు దాటిస్తున్నారు - నల్గొండ జిల్లా వార్తలు

పేదల కోసం ఇస్తున్న రేషన్​ బియ్యం పక్కదారి పడుతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని దొడ్డిదారిన రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిళ్లు మాత్రమే జరిగే ఈ దందా, ఈ మధ్యకాలంలో రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి పట్టపగలే లారీలకు లారీలు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

ration rice send to other states in nalgonda district
రేషన్​ బియ్యాన్ని నూకలుగా మార్చి సరిహద్దులు దాటిస్తున్నారు

By

Published : Jul 2, 2020, 12:15 PM IST

నల్గొండ జిల్లా మిర్యాగూడలో పోలీసులు దాడులు నిర్వహించి రేషన్ బియ్యం లారీలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్కులు అనుమానం రాకుండా రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి కోళ్ల దానకు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వీరికి సహకరిస్తున్న మిల్లులపై కూడా పోలీసులు దాడులు చేసి పిండి మరలను సీజ్ చేశారు.

మే 5న ఆలగడప వద్ద సన్నిధి రమణకుమార్​కు చెందిన 210 క్వింటాళ్ల రేషన్ బియ్యం నూకలుగా మార్చి లారీలో ఏపీకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మే 27న అదే వ్యక్తికి చెందిన ముప్పై ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

జూన్ 8న రెండు లారీలు, ఒక మ్యాక్సీ క్యాబ్​లో 50 కిలోల రేషన్ బియ్యాన్ని వాడపల్లి వద్ద ఆంధ్రాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. మార్చ్​ 13న పోతుగంటి శ్రీను అనే వ్యాపారి మిర్యాలగూడలో తన సొంత వాహనాల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుబడ్డాడు. రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి అక్రమ వ్యాపారం చేస్తున్న సన్నిధి రమణకుమార్​పై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ కేంద్ర కారాగారం తరలించారు.

ఇద చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ABOUT THE AUTHOR

...view details