తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'తల్లాడలో రెండు లారీల రేషన్​ బియ్యం సీజ్' - ఖమ్మం జిల్లా తాజా సమాచారం

ఖమ్మం జిల్లా తల్లాడలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి వైపు వెళ్తున్న రెండు లారీలను సీజ్ చేసి, ఇద్దరు వక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ration rice caught by police in khammam dist in two lorry seized
'తల్లాడలో రెండు లారీల రేషన్​ బియ్యం సీజ్'

By

Published : Nov 22, 2020, 6:08 PM IST

ఖమ్మం నుంచి రాజమండ్రికి అక్రమంగా తరలిస్తున్న చౌకబియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్నపోలీసులు జిల్లాలోని తల్లాడ వద్ద తనిఖీలు నిర్వహించారు.

రెండు లారీలను సీజ్ చేసి, 41 టన్నుల రేషన్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బియ్యాన్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ సత్యనారాయణ వెల్లడించారు.

ఇదీ చూడండి:లారీని ఢీకొన్న కారు...ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details