సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో దారుణం చోటుచేసుకుంది. కూలీ చేసుకుని జీవించి దంపతులకు నాలుగేళ్ల కూతురుంది. శుక్రవారం రోజు రాత్రి కూతురిని ఇద్దరి మధ్యలో పడుకొబెట్టుకుని నిద్రిస్తున్నారు. చిన్నారి నోరునొక్కి ఓ గుర్తుతెలియని దుండగుడు అపహరించాడు.
దారుణం: నాలుగేళ్ల చిన్నారిని అపహరించి అత్యాచారం - అత్యాచార వార్తలు
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా... కామాంధులు మాత్రం ఎలాంటి జంకు లేకుండా రెచ్చిపోతున్నారు. రాత్రి తల్లిదండ్రుల మధ్య పడుకున్న ఓ నాలుగేళ్ల చిన్నారిని అపహరించి అత్యాచారం చేసిన దుర్ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో జరిగింది.
rape on 4 years baby in domadugu
దూరంగా తీసుకెళ్లి పాపపై అత్యాచారం చేశాడు. అనంతరం తీసుకొచ్చి ఇంటికి సమీపంలో వదిలేసివెళ్లాడు. తల్లిదండ్రులకు మెలుకువ వచ్చి చూడగా... అసలు విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా... చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.