సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని ముకుందాపురంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వీఆర్ఏ.. మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆత్మకూరు(ఎస్) మండలానికి చెందిన మానసిక వికలాంగురాలైన మైనర్ బాలిక దసరా పండుగ సందర్భంగా తన అమ్మమ్మ గ్రామమైన ముకుందాపురానికి వచ్చింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన వీరయ్య అనే వీఆర్ఏ మద్యం మత్తులో ఒంటరిగా కనిపించిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పగా ఆమె తాతయ్య పగిళ్ల సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.