తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి జీవిత ఖైదు - మేడ్చల్​ జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం హత్య వార్తలు

అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికను కిడ్నాప్​ చేశాడు. అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ. 5000 జరిమానా విధించింది కోర్టు.

rape-murder-of-a-six-year-old-girl-life-imprisonment-for-the-accused-fine
ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా

By

Published : Sep 15, 2020, 10:46 PM IST

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా బొల్లారానికి చెందిన రాజేశ్ అల్వాల్​కు చెందిన ఓ మైనర్ బాలికను సోమవారం కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలికను తుర్కపల్లి తీసుకెళ్లి రైల్వే ట్రాక్​పై అత్యాచారం చేసి, హత్య చేశాడు.

ఈ క్రమంలో బాలిక కనిపించట్లేదంటూ కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తుర్కపల్లి రైల్వే ట్రాక్​పై బాలిక మృతదేహాన్ని గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. ఎల్బీనగర్ కోర్టు నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.5000 జరిమానా విధించింది.

ఇదీచూడండి.. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details