భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. అదే ఆస్పత్రిలో కాంట్రాక్ట్ డాక్టర్‌గా పనిచేస్తున్న భానోత్ రెడ్డి చాలా రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈనెల 24న రాత్రి ఆమె ఇంటికి వెళ్లి అతడు.. కొట్టి ఆపై అత్యాచారం చేశాడని ఆమె తెలిపారు. ఈ మేరకు తన తల్లిదండ్రుల సాయంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేశామని.. దర్యాప్తు అనంతరం నిందితున్ని రిమాండ్‌కు తరలిస్తామని పట్టణ సీఐ వినోద్ రెడ్డి తెలిపారు.
కాంట్రాక్ట్ డాక్టర్‌పై అత్యాచారం కేసు నమోదు - bhadrachalam rape case on doctor
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదు అయింది. ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ.. అక్కడే పనిచేస్తున్న కాంట్రాక్ట్ డాక్టర్ అత్యాచారం చేశాడని స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
కాంట్రాక్ట్ డాక్టర్‌పై అత్యాచారం కేసు నమోదు
TAGGED:
rape case in bhadrachalam