తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పొలంలో పని చేస్తున్న మహిళపై అత్యాచార యత్నం - rape attempt on women in parigi mandal

పొలంలో పని చేస్తున్న మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో చోటుచేసుకుంది. మహిళ అరుపులతో అక్కడికి వచ్చిన గ్రామస్థులు ఆమెను కాపాడారు.

rape attempt on women in vikarabad district while working in field
పొలంలో పని చేస్తున్న మహిళపై అత్యాచార యత్నం

By

Published : Aug 27, 2020, 12:44 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో పొలం పనులు చేస్తున్న ఓ మహిళ(48)పై బిహార్​కు చెందిన అభిరామ్​ అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. సదరు మహిళ గట్టిగా కేకలు వేయడం వల్ల పక్క పొలాల్లో ఉన్న గ్రామస్థులు వచ్చి మహిళను కాపాడారు. అత్యాచారానికి యత్నించిన అభిరామ్​కు గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

నిందితుడు గ్రామ సమీపంలోని ఐరన్​ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు గతంలోనూ తమ ఊరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని రాపోలు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details