తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బోధన్ మండలంలో మైనర్ బాలికపై యువకుడి అత్యాచారయత్నం - minor girl rape attempt case in nizamabad

మైనర్ (9) బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన నిజామాబాద్​ జిల్లా బోధన్ మండలంలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బోధన్ గ్రామీణ పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు.

rape attempt on minor girl at bodhan mandal
బోధన్ మండలంలో మైనర్ బాలికపై యువకుడి అత్యాచారయత్నం

By

Published : Aug 21, 2020, 7:56 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలంలో దారుణం చోటుచేసుకుంది. మైనర్​ బాలిక(9)పై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 20న బాలికను ద్విచక్రవాహనంపై గ్రామశివారుకు తీసుకెళ్లిన యువకుడు.. ఎవరూ లేని సమయం చూసి అత్యాచారానికి యత్నించాడు.

బాలిక కేకలు వేస్తూ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు ఆ యువకుడిపై బోధన్ గ్రామీణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details