ఏపీలోని రాజమండ్రి నుంచి దిల్లీకి రైల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో లగేజీ బ్యాగుల్లో, దుస్తుల మధ్య చిన్నచిన్న ప్యాకెట్లలో గంజాయిని ఉంచి అక్రమ రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే పోలీసులు రామగుండంలో ఏపీ ఎక్స్‌ప్రెస్ ఆగిన వెంటనే బోగీలను తనిఖీ చేశారు.
రైల్లో గంజాయి అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు..
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక మార్గంలో గంజాయిని తరలిస్తున్నారు స్మగ్లర్స్. ఏపీలోని రాజమండ్రి నుంచి దిల్లీకి రైలులో తరలిస్తున్న మత్తు పదార్థాన్ని పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే పోలీసులు పట్టుకున్నారు.
రైలులో గంజాయి అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు..
ద్వితీయ శ్రేణి బోగీల్లో జరిపిన సోదాల్లో 6 ప్యాకెట్లలో ఉన్న రూ.1.20 లక్షల విలువైన 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దిల్లీకి చెందిన యోగేశ్, బిహార్‌కు చెందిన సంజయ్ కుమార్‌ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఎస్.పి.పాస్స్వన్, ఎస్ఐ దారా సింగ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 2,043 కరోనా కేసులు, 11 మంది మృతి