మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చింతపండువాడలో ఓ కారు వాషింగ్ సెంటర్లో నాసిరకం ఇంజిన్ ఆయిల్ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీ చేశారు. ముజాయిద్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతి లేకుండా హైదరాబాద్ నుంచి నాణ్యతలేని ఇంజిన్ ఆయిల్‌ను మంచిర్యాలలోని తన కారు వాషింగ్ సెంటర్‌కు తరలించేవాడని సీఐ కిరణ్ తెలిపారు. ఆ ఆయిల్లో రంగులను కలిపి, వాడి పడేసిన ఖాళీ ఇంజిన్ ఆయిల్ డబ్బాళ్లో నాసిరకం ఇంజిన్ ఆయిల్ నింపి విక్రయించేవాడని వెల్లడించారు.
కల్తీ ఇంజిన్ ఆయిల్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు..
కల్తీ ఇంజిన్ ఆయిల్ విక్రయిస్తున్న వ్యక్తిని రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ కిరణ్ తెలిపారు.
కల్తీ ఇంజిన్ ఆయిల్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు..
డబ్బాపై లేబుల్‌ను అతికించి లక్షెట్టిపేట మండలం ఇటిక్యాలలోని ఆటోస్టోర్కు కూడా తరలించేవాడని చెప్పారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసి ముజాయిద్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కిరణ్ తెలిపారు.
- ఇదీ చూడండి :మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత