మసాజ్ సెంటర్ ముసుగుతో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో.. సైఫాబాద్ పోలీసులు అర్ధరాత్రి సమయంలో దాడి నిర్వహించారు. 'అట్లాంటిక్ హాస్పిటాలిటీ ఫిజియోథెరఫీ క్లినిక్' పేరిట ఏసీ గార్డ్ అడ్వకేట్ కాలనీలోని ఖురేషి టవర్స్ 202లో నిర్వహిస్తున్న ఈ 'అదోరకం' మసాజ్ కేంద్రంపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. విటులతో పాటు అమ్మాయిలను, నిర్వాహకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఓ ముఠా గుట్టు రట్టు - crime updates in hyderabad
మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ముఠా గుట్టును హైదరాబాద్ సైఫాబాద్ పోలీసులు రట్టు చేశారు. విటులతో పాటు అమ్మాయిలను, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నామని డీఐ రాజు నాయక్ తెలిపారు. నిందితుల నుంచి 5 సెల్‌ఫోన్లు, నగదు, స్వైపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
![మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఓ ముఠా గుట్టు రట్టు raids-at-massage-center-at-advocate-colony-ac-guards-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10175036-709-10175036-1610173099150.jpg)
మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఓ ముఠా గుట్టు రట్టు
నిర్వాహకురాలు మెహరాజున్నీసా(45) గతంలో మెహదీపట్నంలోని ఓ మసాజ్ సెంటర్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసేది. ఆ సెంటర్ యజమాని.. దానిని అమ్మివేయడంతో మెహరాజున్నీసా కొనుగోలు చేసింది. అక్కడి నుంచే మసాజ్ పేరిట వ్యభిచారం నిర్వహించిన ఆమె.. అక్కడి నుంచి సెంటర్‌ను ఏసీ గార్డ్‌కు మార్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 5 సెల్‌ఫోన్లు, నగదు, స్వైపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
ఇదీ చూడండి: క్లిక్ చేస్తే చాలు.. మాయచేసి ఉచ్చులోకి దించుతారు