హయత్‌నగర్‌లో ఈ నెల 16న జరిగిన ఏటీఏం చోరీ కేసులో రాచకొండ సీసీఎస్ పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అంబర్‌పేట్‌కు చెందిన అమీర్, అఫ్రిదీ ఏటీఏం చోరీ ముఠాకు సహకరించినట్టు ఆధారాలు సేకరించిన పోలీసులు... నిందితుల నుంచి 4 కార్లు, ద్విచక్ర వాహనం, ఏటీఎం ధ్వంసం చేయడానికి ఉపయోగించే పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
హర్యానాకు చెందిన ముఠాతో... అమీర్, అప్రిదీతో చర్లపల్లి జైళ్లో గతేడాది పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత.... వారు తరచూ అమీర్‌తో ఫోన్‌లో మాట్లాడే వాళ్లు. కాపలా లేని ఏటీఎం కేంద్రాలను ఎంపిక చేసుకొని... అమీర్ హర్యానా ముఠాకు సమాచారం ఇచ్చేవాడు. దీంతో ఈ నెల 11న రైళ్లో వచ్చి... ఆటోనగర్‌లోని ఓ లాడ్జ్‌లో ఉన్నారు. ఈ నెల 14 తెల్లవారుజామున విమానంలో హైదరాబాద్ వచ్చిన మరో ఇద్దరు సభ్యుల హర్యానా ముఠాను అమీర్, అఫ్రిదీ కలిసి అదే లాడ్జ్‌కు తీసుకెళ్లారు.