తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. నిర్వాహకుల అరెస్టు!

మానవ అక్రమ రవాణా నిరోధించేందుకు రాచకొండ పోలీసులు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి నిఘా పెడుతున్నారు. మహిళల అక్రమ రవాణా చేస్తున్న ఏజెంట్లు, నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే పలువురిపై పీడీ చట్టం ప్రయోగిస్తున్నారు. కీసరలో వ్యభిచారం కేసులో అరెస్టు చేసిన వ్యభిచారగృహం నిర్వాహకురాలు దేవిపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పీడీ చట్టం ప్రయోగించినట్లు తెలిపారు.

Rachakonda Police Attacks On prostitution house In Keesara
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. నిర్వాహకుల అరెస్టు!

By

Published : Sep 20, 2020, 5:22 PM IST

మానవ అక్రమ రవాణా చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. మహిళలకు ఉపాధి కల్పిస్తామంటూ ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వ్యభిచారకూపంలోకి దింపే వారిపై పీడీ చట్టం ప్రయోగిస్తున్నామన్నారు. మానవ అక్రమ రవాణా నిరోధించేందుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఇన్​స్పెక్టర్​కు బాధ్యతలు అప్పజెప్పారు. జులై నెలలో కీసర ఠాణా పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడిన నిర్వాహకురాలు దేవిపై మహేష్ భగవత్ పీడీ చట్టం ప్రయోగించారు. అమీర్​పేట్​లో నివాసం ఉండే దేవి... మరో ఇద్దరితో కలిసి బల్కంపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తోంది. పశ్చిమబంగకు చెందిన యువతులను అక్కడున్న ఏజెంట్ల సహకారంతో ఉపాధి చూపిస్తామంటూ హైదరాబాద్​కు తీసుకొచ్చి.. వ్యభిచారం కూపంలోకి దింపుతున్నట్టు తేలింది.

జులై 28న రాచకొండ ఎస్ఓటీ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. విటులలా నటిస్తూ.. దేవిని ఆన్​లైన్​లో సంప్రదించారు. వారిని దేవి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటికి రావాల్సిందిగా సూచించింది. సివిల్​ డ్రెస్సులో అక్కడికి వెళ్లిన ఎస్ఓటీ పోలీసులు.. నిర్వాహకురాలు దేవి, వంశీరెడ్డి, చిన్నలను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమబంగ నుంచి తీసుకొచ్చిన యువతుల ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి.. ఆన్​లైన్​లో విటులను ఆకర్షిస్తున్నారు. ఫోటోలు చూసి ఫోన్​లో సంప్రదించిన వాళ్లను డబ్బులు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాల్సిందిగా సూచిస్తున్నారు. డబ్బులు చెల్లించిన అనంతరం... ముందే నిర్దేశించుకున్న ఇంటికి యువతులను తీసుకెళ్తున్నారు. విజయవాడకు చెందిన దేవి అమీర్​పేట్​లో ఉంటూ గతంలోనూ వ్యభిచారం నిర్వహించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోనూ దేవి వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించి.. ఆమెపై పీడీ చట్టం ప్రయోగించారు. దేవిపై పీడీ చట్టం ప్రయోగించడం వల్ల ఆమె ఏడాది పాటు జైలుశిక్ష అనుభవించక తప్పదు. జులై 28న అరెస్టైన ఆమె.. చంచల్​గూడ మహిళా జైల్లో రిమాండ్​ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నది.

ఇదీ చూడండి:ఇష్టం వచ్చినట్టు బిల్లులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు: తలసాని

ABOUT THE AUTHOR

...view details