మావోయిస్టులమని బెదిరిస్తూ.. దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ముఠాకు చెందిన నేరగాడిపై రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులమని, గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరులమని బెదిరిస్తున్న బోయిని శ్రీను, రాజశేఖర్, మోహన్, రాము, హరిప్రసాద్, శ్యామ్ అనే వ్యక్తులను అరెస్టు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించారు.
నకిలీ మావోయిస్టు హల్చల్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
మావోయిస్టులమని బెదిరిస్తూ దోపిడీలు.. అపహరణలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన నేరగాడిపై రాచకొండ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. మావోయిస్టులమని, గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరులమని బెదిరిస్తూ పలువురి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పలు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఆరుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి.. సులభంగా డబ్బు సంపాదించాలని భావించారు. ఇందుకోసం మావోయిస్టులమని, గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరులమని దోపిడీలు, కిడ్నాప్‌లు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మల్లాపూర్‌లోని సైమ్యాక్స్ సంస్థ యజమాని రామచంద్రమూర్తిని అపహరించారు. అతన్ని విడుదల చేసేందుకు కుటుంబసభ్యుల నుంచి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. వారు డబ్బు చెల్లించిన తర్వాత అతన్ని విడిచిపెట్టారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ముఠాలోని బోయిని శ్రీనుని అరెస్టు చేశారు. నిందితుడిపై పీడీ చట్టం నమోదు చేసి.. జైలుకు తరలించారు. త్వరలోనే మిగతా వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు.