హైదరాబాద్ నగర శివారుల్లోని ఓకళాశాలలో చదువుతున్న యువతికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయి. అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు స్నేహితుడే ఆ యువతిని ‘కాల్‌గర్ల్’గా ప్రచారం చేసినట్లు తేల్చారు.
ప్రియురాలిని కాల్‌గర్ల్‌గా ప్రచారం చేశాడు.. - call girls news
ప్రేమంటే మనం ప్రేమించే వారికి కష్టం రాకుండా చూసుకోవడం. సమస్యల్లో ఉంటే నేనున్నానంటూ నిలబడటం. కానీ ప్రేమను తిరస్కరించిందని యువతిపై కోపం పెంచుకున్నాడు ఓ యువకుడు. ఆమె పేరుతో డేటింగ్ వెబ్‌సైట్‌లో అసభ్యకరమైన ఫొటోలను అప్‌లోడ్ చేసి.. ‘కాల్‌గర్ల్’గా ప్రచారం చేశాడు.
ప్రేమను తిరస్కరించిందని.. కాల్‌గర్ల్‌గా ప్రచారం చేశాడు.
కింగ్‌కోఠికి చెందిన మహ్మద్ సమీర్(25), బాధితురాలు మూడు నెలల కిందట కళాశాలలో ఒకరికొకరు పరిచయమయ్యారు. కొన్నాళ్లకు సమీర్ తన ప్రేమను ఆమెతో వ్యక్తపరిచాడు. యువతి తిరస్కరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఓ డేటింగ్ వెబ్‌సైట్‌లో అసభ్యకరమైన ఫొటోలను అప్‌లోడ్ చేసి.. ఆ చిత్రాల కింద బాధితురాలి ఫోన్ నంబరు, వివరాలు ఇచ్చాడు. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి:కిలాడి జోడి.. నకిలీ ప్రొఫైల్‌తో రూ.21 లక్షల దోపిడి