లాక్డౌన్ అన్‌లాక్ తర్వాత మహిళల అక్రమ రవాణా మళ్లీ మొదలైందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ముగ్గురిని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో పట్టుకున్నామని అన్నారు. నిందితులు పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఐదుగురు బాధితులకు విముక్తి కల్పించినట్లు సీపీ చెప్పారు.
అన్‌లాక్ తర్వాత మళ్లీ మొదలు.. మహిళల అక్రమ రవాణాలో ఏడుగురి అరెస్టు
లాక్డౌన్ అన్‌లాక్ తర్వాత మహిళల అక్రమ రవాణా మళ్లీ మొదలైందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Seven arrested in women trafficking case
బాధితుల్లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్‌కు చెందిన మహిళలున్నారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్న మోజమ్ మండల్ కోసం గాలిస్తున్న క్రమంలో లభించిన సమాచారంతో మరో నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరంతా బంగాల్ రాష్ట్రానికి, బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు.