ప్రజలను కరోనా వైరస్‌తో చంపేందుకు ఉచితంగా మాస్కులు పంచుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సుచించారు. సామాజిక మాధ్యమాల్లో ఆడియో క్లిప్‌లను పోస్ట్ చేస్తున్నారని... అవన్నీ అవాస్తవమని తెలిపారు.
'కరోనా మాస్కుల వార్తలు అవాస్తవం... భయపడకండి' - మాస్కుల ఉచిత పంపిణీ
మాస్కుల ఉచిత పంపిణీపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య వార్తలపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పందించారు. ప్రజలను కరోనా వైరస్‌తో చంపేందుకు ఉచితంగా మాస్కులు పంచుతున్నారని వస్తున్న వార్తలను సీపీ ఖండించారు. అవన్నీ అవాస్తవమని... ఎవరూ నమ్మొద్దని సూచించారు.
'కరోనా మాస్కుల వార్తలు అవాస్తవం... భయపడకండి'
ప్రజలు ఇలాంటి అసత్య వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. ప్రజలను భయాందోళనకు గురి చేసే వార్తలు ప్రచారం చేసినా.. షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ హెచ్చరించారు.
ఇదీ చూడండి: ప్రయాణికులకు శుభవార్త: పండుగ వేళ.. ప్రత్యేక రైళ్లు
Last Updated : Dec 15, 2020, 7:51 AM IST