రాచకొండ కమిషనరేట్ పరిధిలో బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులపై సీపీ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్కు చెందిన ఆటో డ్రైవర్లు రమేశ్, సంతోశ్, పవన్... ఆగస్టు 25న రాత్రి ఎల్బీనగర్ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో హయత్‌నగర్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులపై పీడీయాక్ట్ - Telanagana news
రాచకొండ కమిషనరేట్ పరిధిలో బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులపై సీపీ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ నమోదు చేశారు.
గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులపై పీడీయాక్ట్
అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. గతంలో వీరిపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సంతోశ్‌పై గతంలోనే పీడీ యాక్ట్ నమోదు చేశారు. తాజాగా రమేశ్, పవన్‌లపై కూడా పీడియాక్ట్ నమోదు చేశారు.
ఇదీ చదవండి:శంషాబాద్ విమానాశ్రయంలో 373 గ్రాముల బంగారం పట్టివేత