తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చైన్​ స్నాచర్​పై పీడీ యాక్ట్ నమోదు

వరుస గొలుసు చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. గ్లాస్ క్లీనర్​గా పనిచేసే అతడు త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు.

rachakonda-cp-file-pd-act-on-chain-snatcher-in-hyderabad
చైన్​ స్నాచర్​పై పీడీ యాక్ట్ నమోదు

By

Published : Jan 6, 2021, 1:26 PM IST

హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో దిలీప్ అనే వ్యక్తిపై పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలతో మారేడిపల్లి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. తన సహచరులతో కలిసి అనేకసార్లు వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతుండటంతో అతనిపై పీడీ యాక్ట్ విధించారు. ఒడిస్సా రాష్ట్రం కటక్ ప్రాంతానికి చెందిన దిలీప్ మల్కాజ్​గిరిలోని మల్లికార్జున నగర్​లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. గ్లాస్ క్లీనింగ్ వర్కర్​గా దిలీప్ పని చేస్తున్నట్లు వెల్లడించారు.

త్వరగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మారేడుపల్లి పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో నేరాలు అంగీకరించిన అనంతరం అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. దిలీప్​ను చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇదీ చదవండి:కిడ్నాప్ కేసు: పోలీసుల అదుపులో భూమా అఖిలప్రియ దంపతులు

ABOUT THE AUTHOR

...view details