తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏడేళ్ల బాలుడ్ని మింగేసిన క్వారీ గుంత - Parents in distress in Agraharam

పొలంలోకి పశువులను మేతకు తీసుకెళ్లిన ఓ బాలుడు.. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో జారి పడి మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని విశాఖ జిల్లా డి.అగ్రహారంలో చోటు చేసుకుంది.

quarry-pit-swallowed-a-seven-year-old-boy-in-kotapaadu-mandal-visakhapatnam-district
ఏడేళ్ల బాలుడ్ని మింగేసిన క్వారీ గుంత

By

Published : Oct 31, 2020, 1:49 PM IST

ఏపీలోని విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం డి.అగ్రహారంలో విషాదం చోటు చేసుకుంది. అదే గ్రామంలో లెక్కల వెంకట సత్యం, మాధవి దంపతులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. వారికి ఏడేళ్ల బాబు, ఐదేళ్ల బాలిక ఉన్నారు. పాఠశాలలు లేకపోవడంతో ఏడేళ్ల కుమారుడు మనోజ్​ పశువులను మేతకు తీసుకెళ్తున్నాడు. ఎప్పటిలాగే తన తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. కుమారుడు పశువులను కాసేందుకు వెళ్లాడు.

క్వారీ గుంత వద్దకు..

ఈ క్రమంలో ఆవులు మేతమేస్తూ క్వారీ గుంత వద్దకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మనోజ్.. ఆవుల కోసం వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు క్వారీ గుంత నీటిలో జారిపడి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు క్వారీ గుంతలో పడి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చూడండి :వరద సాయం కోసం నగరంలో పలుచోట్ల బాధితుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details