సంక్రాంతి వేడుకలు ముగిశాయి. రోజుకంటే పడుకోవడానికి ఇంకాస్త ఆసల్యమైంది. అప్పుడే నిద్రలోకి జారుకుంటుండగా... ఒక్కసారిగా ఎవరో వచ్చిన అలికిడి. లేచి చూసేసరికే... ఓ వ్యక్తి మీదపడి రక్కేయత్నం చేస్తున్నాడు. కేకలు వేయడంతో అందరూ గుమిగూడారు. ఆ వ్యక్తి మాత్రం మహిళలనే టార్గెట్ చేస్తూ దాడికి యత్నిస్తున్నాడు. నిత్యం ప్రశాంతంగా ఉండే కోదాడలోని శ్రీనివాస నగర్లో శుక్రవారం అర్ధరాత్రి పరిస్థితి ఇదీ!
అర్ధరాత్రి వేళ అందరూ నిద్రిస్తుండగా ఓ సైకో కాలనీలోకి ప్రవేశించాడు. ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో.. మిగతా వాళ్లు వచ్చారు. అతను మాత్రం ఆగలేదు. అదే రీతిలో దాడికి యత్నిస్తూనే ఉన్నాడు. ఓ మహిళ మెడను పట్టుకుని లాగుతూ.. బలంగా రక్కే ప్రయత్నం చేశాడు. అదృష్టవశాత్తు ఆమె తప్పించుకుంది. జనం ఇంకాస్త పెరగడంతో సైకో.. పరారయ్యాడు.