మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన రవీందర్ అనే వ్యక్తి ఫైనాన్స్‌లో లారీని తీసుకున్నాడు. అయితే నెలవారీగా డబ్బులు చెల్లించలేదని ఫైనాన్స్ నిర్వాహకులు లారీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన రవీందర్ అనారోగ్యం పాలై కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఫైనాన్స్ కార్యాలయం ముందు మృతదేహంతో ధర్నా
వాయిదాలు సక్రమంగా చెల్లించక పోవటం వల్ల ఫైనాన్స్ నిర్వాహకులు తన లారీని లాక్కోవటంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. ఫైనాన్స్ కార్యాలయం ముందు మృతదేహంతో మృతుని బంధువులు ధర్నా దిగారు. ఈ ఘటన మంచిర్యాలలో జరిగింది.
ఫైనాన్స్ కార్యాలయం ముందు మృతదేహంతో ధర్నా
రవీందర్ మృతికి ఫైనాన్స్ నిర్వాహకులు కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో ఫైనాన్స్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.
ఇదీ చదవండి:రేపు దిల్లీ వెళ్లనున్న ఎంపీ రేవంత్ రెడ్డి.. పీసీసీ కోసమేనా?