వైద్యులు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల తన తండ్రి మృతి చెందాడని భద్రాచలం ప్రభుత్వాసుపత్రి ఎదుట మృతుని కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామానికి చెందిన పెంటయ్య (55) కడుపులో మంట, ఆయాసం రావడం వల్ల బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చారు.
ఆసుపత్రిలో నర్సులు మాత్రమే సెలైన్ పెట్టారని పరిస్థితి ఇబ్బందిగా ఉంది డాక్టర్ వచ్చి చూడాలని కుటుంబసభ్యులు కోరినా వైద్యులు ఎవరూ రాలేదని వారు ఆరోపించారు. దీంతో పన్నెండున్నర గంటలకు తన తండ్రి చనిపోయాడని పెంటయ్య కుమారులు, కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వైద్యుల నిర్లక్ష్యమేనని ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.