తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బైక్​ ఢీకొని వ్యక్తి మృతి.. మృతదేహంతో ధర్నా - protest with corpse in Warangal

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో బైక్​ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. బైక్​ ఢీకొట్టిన వ్యక్తి ఇంటి ముందు న్యాయం చేయాలని కోరుతూ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.

బైక్​ ఢీకొని వ్యక్తి మృతి.. మృతదేహంతో ధర్నా
బైక్​ ఢీకొని వ్యక్తి మృతి.. మృతదేహంతో ధర్నా

By

Published : Dec 16, 2020, 10:10 AM IST

వరంగల్​లోని పుప్పాల గుట్టకి చెందిన గంగారపు ప్రసన్నకుమార్​(47) హన్మకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా గ్రీన్ స్క్వేర్ ప్లాజా ముందు రోడ్డు దాటుతుండగా... భాను అనే యువతి స్కూటీ మీద వచ్చి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రసన్నకుమార్​కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్దీ నిమిషాలకే ప్రసన్నకుమార్​ మృతి చెందాడు.

మృతుడి కుటుంబ సభ్యులు తమకి న్యాయం చేయాలంటూ.. ప్రమాదం చేసిన యువతి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు. న్యాయం చేసేంతవరకు మృతదేహాన్ని తీసేదిలేదంటూ.. ఇంటి ముందు బైఠాయించారు. పోలీసులు జోక్యం చేసుకుని మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.​

ఇదీ చదవండి:నమ్మి భూములిస్తే... నట్టేట ముంచుతారా?

ABOUT THE AUTHOR

...view details